కరోనా సేఫ్
కరోనావైరస్ (COVID-19) నుంచి సురక్షితంగా ఉండటానికి సలహాలు, సూచనలు.
Last updated
కరోనావైరస్ (COVID-19) నుంచి సురక్షితంగా ఉండటానికి సలహాలు, సూచనలు.
Last updated
కరోనావైరస్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే వైరస్ల కుటుంబానికి చెందినది. ఇది జంతువుల నుంచి మానవులకు వ్యాపించే వైరస్. ప్రస్తుతం ఏడు కరోనావైరస్ లను గుర్తించారు. ఇవి మనుషులను ప్రభావితం చేసే వైరస్లు. వీటిలో నాలుగు వైరస్ల ఎటువంటి ప్రాణాపాయ ప్రమాదం లేదు. మిగిలిన మూడు తీవ్రమైన వ్యాధులకు కారణమవుతాయి. మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, లేదా MERS-CoV వల్ల కలిగే మెర్స్, తీవ్రమైన అక్యూట్ సార్స్ వల్ల కలిగే SARS-CoV-2 వంటివి శ్వాసకోశ సిండ్రోమ్ మరియు [SARS-CoV-2 వల్ల కలిగే కరోనా 2019 వ్యాది] (https://www.cdc.gov/coronavirus/2019-ncov/index.html).
COVID-19 అనే కరోనావైరస్ ను ఇంతకుముందు గుర్తించలేదు. అది ప్రకృతిలో జంతువు నుండి మానవునికి వ్యాపించే వైరస్. ఇది మొట్టమొదట చైనాలోని వుహాన్ సిటీ నుండి 31 డిసెంబర్ 2019 న తన ప్రతాపాన్ని చూపింది. జ్వరం, అలసట మరియు పొడి దగ్గు వంటి వాటివల్ల COVID-19 వైరస్ వ్యాప్తి చెందుతుంది. కొంతమంది రోగులకు నొప్పులు, నాసికా రద్దీ, ముక్కు కారటం, గొంతు నొప్పి లేదా అతిసారం వంటివాటి వల్ల కూడా ఇది వ్యాపిస్తుంది.
వైరస్ సోకిన వారిలో 80% మంది వైద్య సహాయంతోనే కోలుకుంటారు. వృద్ధులు మరియు అనారోగ్యంతో ఉన్నవారికి వేగంగా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. వైరస్ సోకిన వారిలో 14% మంది తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. అధ్యయనాల ప్రకారం 5% మంది మాత్రమే ప్రాణాలను పొగొట్టుకునే అవకాశం ఉంటుంది.
ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా 100,000 కన్నా ఎక్కువ మందిని ప్రభావితం చేసింది. 6000 మందికి పైగా మరణాలకు కారణమైంది. ఈ వైరస్ కు WHO గ్లోబల్ స్థాయిలో వెరీ హై రిస్క్ వైరస్ గా ప్రకటించింది.
ఈ గైడ్ ఇప్పటికీ ప్రోగ్రెస్‌లో ఉంది. కొన్ని విభాగాలు పూర్తయ్యే వరకు మేము సూచన కోసం అధికారిక లింక్‌లను అందిస్తాము. గైడ్ నవీకరించబడే వరకు మీరు ఆ సూచనలను పాటించాలి.
ఈ సూచనల ముఖ్య ఉద్దేశం ఏంటి?
వైరస్ నివారణ చర్యలు, వైరస్ జాతి గురించి సమాచారం, అధికారిక ప్రకటనలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ గైడ్ నిర్ణయించబడింది. ఈ సూచనలు వివిధ అధికారిక సమాచారాల నుండి గుర్తించబడ్డాయి.
COVID-19 అనే కరోనా వైరస్ గురించి చాలా మందికి అవగాహన లేదు. ప్రభుత్వాలు మరియు ప్రభుత్వేతర వెబ్సైట్లలో వైరస్ గురించి సమాచారం ఉంటుంది. అయితే COVID-19 గురించి చాలా నకిలీ వార్తలు, తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో ప్రసారం అవుతోంది.
ఈ గైడ్ ఆ సమాచారాన్ని కూడా మీకు తెలుపుతుంది. వినియోగదారులు భయపడకుండా ఉండేందుకు, వాస్తవాలను తెలుసుకునేందుకు ఈ గైడ్ ఉపయోగపడుతుంది.